ఎక్కడో మనసు వెళ్ళిపోయింది

పాట రచయిత: ప్రసన్న బెన్హర్
Lyricist: Prasanna Benhur

Telugu Lyrics

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది
ఏమిటో ఇటు రానే రానంది
ఆహాహా.. ఓహోహో…
నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుంది
ఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)
అక్కడే చిక్కుకుపోయానంటుంది
బయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2)         ||ఎక్కడో||

జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుంది
తన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)
దేనికీ ఇక చోటే లేదంది
యేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2)         ||ఎక్కడో||

ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుంది
ఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)
అక్కడే కరిగిపోతానంటుంది
ప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2)         ||ఎక్కడో||

English Lyrics

Audio

దిక్కులన్ని నీవేలే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2)
ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2)
నిత్యమై నాలోన – జీవమై నీవుండ           ||దిక్కులన్ని||

లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)
నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2)
చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే          ||దిక్కులన్ని||

దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)
భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2)
హీనమైన రూపానాన – గానమై యేసన్న             ||దిక్కులన్ని||

English Lyrics

Audio

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

పాట రచయిత: బాబన్న
Lyricist: Baabanna

Telugu Lyrics

నేడు ఇక్కడ రేపు ఎక్కడో
తెలియని పయనం ఓ మానవా (2)
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2)         ||నేడు||

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2)
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2)
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు      ||నేడు||

అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట (2)
దిగంబరిగానే నీవు పుడతావు
దిగంబరిగానే నీవు వెళతావు (2)         ||నేడు||

English Lyrics

Audio

 

 

HOME