ఎన్నిక లేని నాపై

పాట రచయిత: శోభా రాణి
Lyricist: Shobha Rani

Telugu Lyrics

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు (2)
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము       ||ఎన్నిక||

బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||

పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను (2)        ||నీకే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎన్నిక లేని నరుని మీద (2)
మమతకు ప్రేమకు అర్హత లేని (2)
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ     ||ఎందుకో||

ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను        ||ఎందుకో||

సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి (2)
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా         ||ఎందుకో||

నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా (2)
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా         ||ఎందుకో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME