తలవంచకు నేస్తమా

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics

తలవంచకు నేస్తమా (2)
తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ.. మాదిరి
నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ
నీవు మండాలి ఓ.. జ్వాలగా
నీవు చేరాలి ఓ.. గమ్యము        ||తలవంచకు||

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే
క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2)       ||నీవు||

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో
యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2)       ||నీవు||

English Lyrics

Audio

యేసు పరిశుద్ధ నామమునకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రము (2)

ఇహపరమున మేలైన నామము
శక్తి గల్గినట్టి నామమిది (2)
పరిశుద్దులు స్తుతించు నామమిది (2)          ||యేసు||

సైతానున్‌ పాతాళమును జయించు
వీరత్వము గల నామమిది (2)
జయమొందెదము ఈ నామమున (2)          ||యేసు||

నశించు పాపుల రక్షించు లోక
మున కేతెంచిన నామమిది (2)
పరలోకమున చేర్చు నామమిది (2)          ||యేసు||

ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు
ఉన్నత దేవుని నామమిది (2)
లోకమంతా ప్రకాశించే నామమిది (2)          ||యేసు||

శోధన, బాధల, కష్ట సమయాన
ఓదార్చి నడుపు నామమిది (2)
ఆటంకము తొలగించు నామమిది (2)          ||యేసు||

English Lyrics

Audio

 

 

 

నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ జీవితం క్షణ భంగురం
నీ యవ్వనం తృణాప్రాయం
ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
ఎప్పుడు పోవునో నీకు తెలియదు
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరీ
పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…

ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)
ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)
ఈ క్షణమే తేల్చుకో       ||నీ జీవితం||

నీకున్నవన్నియు క్షణిక సుఖములే
ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2)
ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2)
ప్రభుని హృదిని చేర్చుకో      ||నీ జీవితం||

English Lyrics

Audio

 

 

HOME