నీ ధనము నీ ఘనము

పాట రచయిత: బొంతా సమూయేలు
Lyricist: Bonthaa Samooyelu

Telugu Lyrics

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా       ||నీ ధనము||

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా          ||నీ ధనము||

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా        ||నీ ధనము||

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా          ||నీ ధనము||

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా        ||నీ ధనము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గాలి సముద్రపు అలలకు

పాట రచయిత: జీడిపల్లి యోహాన్
Lyricist: Jeedipali Yohan

Telugu Lyrics

గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
ఆదరించెనూ నీ వాక్యము
లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||

శ్రమలలో నాకు తోడుంటివి
మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||

వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
చూపితివి నీ మహిమన్‌ (2)
కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME