నీ జీవితం క్షణ భంగురం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం          ||నీ జీవితం||

ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||

English Lyrics

Audio

నీ జీవితములో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)     ||నీ జీవితములో||

నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2)         ||నీ జీవితములో||

నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2)         ||నీ జీవితములో||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2)         ||నీ జీవితములో||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా (2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ         ||నీ జీవితములో||

English Lyrics

Audio

Chords

HOME