సందడి – 3

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సందడి చేద్దామా – సంతోషిద్దామా
రారాజు పుట్టేనని
గంతులు వేద్దామా – గానము చేద్దామా
శ్రీ యేసు పుట్టేనని (2)
మనసున్న మారాజు పుట్టేనని
సందడి చేద్దామా – సంతోషిద్దామా
మన కొరకు మారాజు పుట్టేనని
సందడి చేద్దామా…
సందడే సందడి…
సందడే సందడి సందడే సందడి
సందడే సందడి (4)

బెత్లహేములో సందడి చేద్దామా
పశుశాలలో సందడి చేద్దామా
దూతలతో చేరి సందడి చేద్దామా
గొల్లలతో చూచి సందడి చేద్దామా (2)
మైమరచి మనసారా సందడి చేద్దామా
ఆటలతో పాటలతో సందడి చేద్దామా
శాలలో చేరి క్రీస్తుని చూచి
సంతోషించి సందడి చేద్దామా
సందడే సందడి…
సందడే సందడి సందడే సందడి
సందడే సందడి (4)

అర్ధరాత్రిలో సందడి చేద్దామా
చుక్కను చూచి సందడి చేద్దామా
దారి చూపగ సందడి చేద్దామా
గొర్రెల విడిచి సందడి చేద్దామా (2)
మైమరచి మదినిండా సందడి చేద్దామా
మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
శాలలో చేరి క్రీస్తుని చూచి
సంతోషించి సందడి చేద్దామా
సందడే సందడి…
సందడే సందడి సందడే సందడి
సందడే సందడి (4)

రాజును చూచి సందడి చేద్దామా
హృదయమార సందడి చేద్దామా
కానుకలిచ్చి సందడి చేద్దామా
సాగిలపడి సందడి చేద్దామా (2)
మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా
మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా
శాలలో చేరి క్రీస్తుని చూచి
సంతోషించి సందడి చేద్దామా
సందడే సందడి…
సందడే సందడి సందడే సందడి
సందడే సందడి (8)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యెహోవాను స్తుతియించు

పాట రచయిత: జోఫి నయనపోగుల
Lyricist: Joffy Nayanapogula

Telugu Lyrics


యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు         ||యెహోవాను||

ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో                ||ఆత్మతోను||

స్వరమండలముతో ఆయనను స్తుతియించు
సితార స్వరములతో ఆయనను స్తుతియించు
గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు         ||ఆత్మతోను||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME