ఈ దినం క్రీస్తు జన్మ దినం

పాట రచయిత: కృపాదాస్ కొల్లాటి
Lyricist: Krupadas Kollati

Telugu Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2)        ||ఈ దినం||

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం        ||ఆడుము||

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము         ||ఈ దినం||

English Lyrics

Audio

భజియింతుము రారే యేసుని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)       ||భజియింతుము||

రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము         ||భజియింతుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

కీర్తింతు నీ నామమున్

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

కీర్తింతు నీ నామమున్
నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2)
మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)
నిను నే కొనియాడెదన్ (4)         ||కీర్తింతు||

ప్రతి ఉదయం నీ స్తుతి గానం
దినమంతయు నీ ధ్యానం (2)
ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)
సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2)          ||కీర్తింతు||

నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)
నిన్నే నేను ఆరాధిస్తూ (2)          ||కీర్తింతు||

అమూల్యమైనది నీ నామం
ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)
ఉన్నతమైనది నీ నామం (2)
నాకై నిలచిన మోక్ష మార్గం (2)          ||కీర్తింతు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME