న్యాయాధిపతి

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన
ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)
ఒక గుంపేమో పరలోకపు గుంపు
రక్షింపబడిన వారికే అది సొంతం
మరు గుంపేమో ఘోర నరకపు గుంపు
నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం       ||న్యాయాధిపతి||

నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది
కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)
కలువరిలో తన ప్రాణం పెట్టిన
యేసయ్యే నీ ప్రాణ రక్షణ
సిలువలో క్రయ ధనమే చెల్లించిన
ఆ ప్రభువే నీ పాప విమోచన         ||ఒక గుంపేమో||

ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు
ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)
మేఘముపై రానైయున్నాడుగా
త్వరలోనే నిను కొనిపోడానికి
వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా
నీ హృదిలో స్వీకరించడానికి         ||ఒక గుంపేమో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

న్యాయాధిపతి అయిన దేవుడు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

న్యాయాధిపతి అయిన దేవుడు
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీవుందువో
యోచించుకో ఓ మానవా (2)      ||న్యాయాధిపతి||

ఆకలితో అలమటించగా
దాహముతో తపియించగా (2)
రోగముతో కృశియించగా (2)
నను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)      ||న్యాయాధిపతి||

గ్రహియించుకో నీదు గమ్యము
విడనాడు పాప గతమును (2)
లేదింక నీకు తరుణము (2)
ప్రభునాశ్రయించుటే బహు క్షేమము
ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)      ||న్యాయాధిపతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏ గుంపులో నున్నావో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)
జాగు చేయక వేగ మేలుకో (2)       ||ఏ గుంపులో||

మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)
చచ్చియుండిన సమాధుల గుంపు (2)       ||ఏ గుంపులో||

కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)
కరకు కల్గిన కఠోరపు గుంపు (2)       ||ఏ గుంపులో||

యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2)       ||ఏ గుంపులో||

ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)
కావలి కాయు కఠినాత్ముల గుంపు (2)       ||ఏ గుంపులో||

సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము (2)
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2)       ||ఏ గుంపులో||

వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)
గదిలో చేరుకో పదిలపర్చుకో (2)       ||ఏ గుంపులో||

English Lyrics

Audio

HOME