పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
యేసయ్య మాట విలువైన మాట
వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ (2)
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య||
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య||
నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2)
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||