యేసుని తిరు హృదయమా

పాట రచయిత: పి ప్రకాష్ రెడ్డి
Lyricist: P Prakash Reddy

Telugu Lyrics


యేసుని తిరు హృదయమా
నన్ను రక్షించు నా దైవమా (2)
స్నేహితుని వోలె ఆదరించావు
బోధకుడై నన్ను మందలించావు (2)          ||యేసుని||

కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు
దుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2)
ఏ విధమున నిన్ను నే పొగడగలను (2)
నీ ఋణమును నేనెలా తీర్చగలను
నా తండ్రి నా దేవా          ||యేసుని||

నను కాచి కాపాడే నా మంచి కాపరివి
నాకింక భయమేల నీ అండదండలలో (2)
జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2)
నీ ఆత్మతో దీవించు నా యేసు
నా తండ్రి నా దేవా          ||యేసుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఉదయమాయె హృదయమా

పాట రచయిత: ఎన్ సంజయ్
Lyricist: N Sanjay

Telugu Lyrics

ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే (2)
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే (2)        ||ఉదయమాయె||

రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే (2)
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే (2)        ||ఉదయమాయె||

తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే (2)
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే (2)        ||ఉదయమాయె||

పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా (2)
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా (2)        ||ఉదయమాయె||

తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని (2)
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా (2)        ||ఉదయమాయె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME