నా చిన్ని హృదయంలో

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Telugu Lyrics


నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

English Lyrics

Audio

ఆలయంలో ప్రవేశించండి

పాట రచయిత: జడ్సన్ పాల్ క్రిస్టోఫర్
Lyricist: Judson Paul Christopher

Telugu Lyrics

ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం        ||ఆలయంలో||

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా       ||ఆలయంలో||

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా          ||ఆలయంలో||

English Lyrics

Audio

HOME