ఇదియే సమయంబు రండి

పాట రచయిత: జాన్ బిల్మోరియా
Lyricist: John Bilmoria

Telugu Lyrics

ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి

పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా         ||ఇక||

రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి            ||ఇక||

బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి          ||ఇక||

వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును          ||ఇక||

సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ           ||ఇక||

జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి           ||ఇక||

English Lyrics

Audio

ఇదియేనయ్య మా ప్రార్థన

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా (2)

నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2)        ||ఆలకించే దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME