నా దీపము యేసయ్యా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము – (2)

ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)
చేసావు పండుగ వెలిగావు నిండుగా (2)        ||నా దీపము||

మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2)        ||నా దీపము||

ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2)        ||నా దీపము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME