బాల యేసుని జన్మ దినం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ         ||బాల||

మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాటలు పాడి          ||బాల||

పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు        ||బాల||

మన జోల పాటలు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు           ||బాల||

English Lyrics

Audio

క్రిస్మస్ శుభదినం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము (2)
క్రిస్మస్ శుభదినం

హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)

దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై (2)
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను (2)       ||హ్యాప్పీ||

కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం (2)
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు (2)        ||హ్యాప్పీ||

ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి (2)
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి (2)       ||హ్యాప్పీ||

English Lyrics

Audio

HOME