జన్మించె జనంబులకు

పాట రచయిత:
Lyricist:

జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు
జన్మించె జనంబులను రక్షింపను (2)
జననమొందె బేత్లెహేము పురమున
జనంబులారా సంతసించుడి – సంతసించుడి        ||జన్మించె||

లేఖనములు తెల్పినట్లు దీనుడై
లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై (2)
లాకమందు దూతలు బాక నాదంబుతో (2)
ఏక స్వరము తోడ పాడిరి (2)      ||జన్మించె||

నీతి సూర్యుడుదయించె నుర్విలో
పాతకంబులెల్ల వీడెను కాంతికి (2)
నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు (2)
సంతసమప్పె దీన ప్రజలకు (2)      ||జన్మించె||

Download Lyrics as: PPT

జన్మించె జన్మించె యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జన్మించె.. జన్మించె..
యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ ..
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా
దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2)
సంతోషించి ఆనందించి
యేసును చూచి పరవశించి (2)
లోకమంతా శుభవార్తను ప్రకటించిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను
యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2)
బంగారు సాంబ్రాణి బోళం
బాల యేసునికి అర్పించి (2)
మనసార పూజించి కొనియాడిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు
తన కిష్టులకు సమాధానము కల్గును గాక (2)
పశువుల పాకలో జన్మించిన యేసయ్యా
మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా (2)
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

English Lyrics

Audio

Download Lyrics as: PPT

జన్మించె జన్మించె

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2)          ||ఊరూ వాడా||

తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు (2)
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి (2)          ||ఊరూ వాడా||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము (2)
మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2)          ||ఊరూ వాడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రారాజు జన్మించే ఇలలోన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
ఓ సోదరా… ఓ సోదరీ… (2)
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)       ||రారాజు||

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

English Lyrics

Audio

శ్రీ యేసుండు జన్మించె

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)
నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు||

ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2)
ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు||

సత్రమందున పశువులశాల యందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు||

పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు||

గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)
దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు||

మన కొరకొక్క శిశువు పుట్టెను (2)
ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు||

పరలోకపు సైన్యంబు గూడెను (2)
మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు||

అక్షయుండగు యేసు పుట్టెను (2)
మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME