క్రిస్మస్ మెడ్లీ – 5

పాట రచయిత:
Lyricist:

నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా (3)

రారండి జనులారా
మనం బేతలేం పోదామా
యూదుల రాజు జన్మించినాడు
వేవేగ వెళ్లుదమా
జన్మ తరియింప తరలుదమా..

సర్వోన్నత స్థలములలోన
దేవునికి మహిమ అమెన్ ఆమెన్
ఆయనకు ఇష్టులైన వారికి
సమాధానమెల్లపుడూ

రారండి జనులారా
మనం బేతలేం పోదామా
యూదుల రాజు జన్మించినాడు
వేవేగ వెళ్లుదమా
జన్మ తరియింప తరలుదమా..

నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా (2)

పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2)

యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్
మన పాపం కొరకు పుట్టాడండోయ్ (2)
యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో (2)

పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ (2)

పాడుడి గీతములు హల్లేలూయ
మీటుడి నాదములు హల్లేలూయ
పాప రహితుడు హల్లేలూయ
పాప వినాషకుడు హల్లేలూయా

ఆకశమున వింత గొలిపెను
అద్భుత తారను గాంచిరి (2)
పయణించిరి జ్ఞానులు ప్రభు జాడకు (2)

పాడుడి గీతములు హల్లేలూయ
మీటుడి నాదములు హల్లేలూయ
పాప రహితుడు హల్లేలూయ
పాప వినాషకుడు హల్లేలూయా

రాజులకు రాజు యేసయ్య
పశువుల పాకలో పుట్టాడయ్యా
రాజులకు రాజు యేసయ్య
నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా

గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా
దూతలు పాటలు పాడిరయ్యా (2)
ఈ వార్తను చాటింప పోదామయ్యా (2)

పోదాము… అహా పోదాము…
పద పోదాము… మనం పోదాము…

పోదాము పోదాము పయణమవుదాము
శుభవార్త చెప్ప పోదాము (2)
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము
శుభవార్త చాటి చెప్ప సాగిపోదాము (2)

పోదాము పోదాము పయణమవుదాము
శుభవార్త చెప్ప పోదాము (2)

శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట (2)
రాజులందారికయ్యో యేసే రాజు అట (2)

పదరా హే పదరా హే

పదరా పోదాము రన్న
శ్రీ యేసుని చూడ
పదరా పోదాము రన్న (4)

నా నా నా న న న
నా నా నా న న న
నా నా నా న న న..
న న న న నా (2)

Download Lyrics as: PPT

సూడ సక్కని బాలుడమ్మో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు (2)        ||సూడ||

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2)        ||సూడ||

మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2)        ||సూడ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME