మరణము గెలిచెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మరణము గెలిచెను మన ప్రభువు
మనుజాళి రక్షణ కోసము (2)
ఎంత ప్రేమ, ఎంత త్యాగం
జయించె సమాధిని (2)      ||మరణము||

పాపపు ఆత్మల రక్షణకై
గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)
నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)
ఎంత జాలి, ఎంత కరుణ
యికను మన పైన (2)      ||మరణము||

నేడే పునరుద్దాన దినం
సర్వ మానవాళికి పర్వ దినం (2)
పాపపు చెర నుండి విడుదల (2)
ఎంత ధన్యం, ఎంత భాగ్యం
నేడే రక్షణ దినం (2)      ||మరణము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశ్చర్యమైన ప్రేమ

పాట రచయిత: జక్కి దేవరాజ్
Lyricist: Jakki Devaraj

Telugu Lyrics

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||

పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||

పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||

శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||

నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME