జీవితంలో నేర్చుకున్నాను

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics

జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా          ||జీవితంలో||

ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము (2)          ||జీవితంలో||

నిర్మించుకున్నాను నా జీవితం
సతతం యేసులో జీవించాలని
పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము (2)          ||జీవితంలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

జీవితంలో నీలా ఉండాలని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక
చేరితి ప్రభు పాదాల చెంత (2)      ||జీవితంలో||

కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో (2)
నీలాగే నడవాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడవాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే నడిచి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో
ఊపవాసములొ ఉపదేశములో (2)
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతకాలని.. యేసయ్యా
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి
నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

English Lyrics

Audio

 

 

HOME