దిక్కులెన్ని తిరిగినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
మనకు దిక్కు ఈ బాల యేసుడే
ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
స్థలము లేక తిరిగి వేసారెను
నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
గుర్తుగా ఉన్నాయి చూడండి         ||దిక్కులెన్ని||

దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
తన మార్గమందు నడుప బుట్టెను
ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
హృదయాలు అర్పించినారయ్యో             ||దిక్కులెన్ని||

English Lyrics

Audio

రాత్రి నేడు రక్షకుండు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా
నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)

లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను
లోక నాథుడై మరియకవతరించెను (2)
ఇతండె దేవుడాయెను (6)          ||రాత్రి||

బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము
యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)
ఈ నాడే మనకు పండగ
రారండి ఆడి పాడగ (3)           ||రాత్రి||

ఆకశాన తార ఒకటి బయలుదేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)
చిన్నారి యేసు బాబును
కళ్లారా చూసి మురిసెను (3)           ||రాత్రి||

పొలములోని గొల్లవారి కనుల ముందర
గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)
మేరమ్మ జోల పాడగా
జగాలు పరవశించెగా (3)           ||రాత్రి||

లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను
భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)
ఇతండె దేవుడాయెను (6)          ||రాత్రి||

English Lyrics

Audio

HOME