బేత్లెహేము పురములో

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
ఊహలకు అందని అద్భుతము జరిగెను
లోక చరిత మార్చిన దైవకార్యము
కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను
అహహ్హ ఆశ్చర్యము ఓహొహ్హో ఆనందము
రారాజు యేసు క్రీస్తుని జననము
అహహ్హ ఏమా దృశ్యము ఓహొహ్హో ఆ మహత్యము
సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము

నన్నాన నా.. నా.. నా న నా న నా (4)
తనన్న నన్నాన నా – (3) తనననా (2)

ధన్యులం హీనులం మనము ధన్యులం
దైవమే మనల కోరి దరికి చేరెను
మనిషిగా మన మధ్య చేరె దీన జన్మతో
పశువుల తొట్టెలోన నిదుర చేసెను
అంటూ బాల యేసుని చూడ వచ్చి గొల్లలు
మనకు శిశువు పుట్టెనంటూ పరవశించిపోయిరి      ||బేత్లెహేము ||

పుట్టెను యూదులకు రాజు పుట్టెను
వెతికిరి ఆ రాజు జాడ కొరకు వెతికిరి
నడిపెను ఆకశాన తార కనపడి
నిలిచెను యేసు ఉన్న చోటు తెలిపెను
తడవు చేయకొచ్చిరి తూర్పు దేశ జ్ఞానులు
యేసు చెంత మోకరించి కానుకలర్పించిరి      ||బేత్లెహేము ||

దొరికెను రక్షకుడు మనకు దొరికెను
తోడుగా ఇమ్మానుయేలు మనకు దొరికెను
దేవుని ప్రేమయే ప్రత్యక్షమాయెను
యేసుని రూపమే మనకు సాక్ష్యము
యేసు జన్మ నింపెను లోకమంత సంబరం
నింపెను నిరీక్షణ కృపయు సమాధానము      ||బేత్లెహేము ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇది దేవుని నిర్ణయము

పాట రచయిత: జోనా సామ్యెల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics

ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

English Lyrics

Audio

అన్నీ సాధ్యమే యేసుకు

పాట రచయిత: జే సీ కూచిపూడి
Lyricist: J C Kuchipudi

Telugu Lyrics

అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||

మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే||

బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||

ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||

కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

English Lyrics

Audio

కన్నీటి లోయలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ  – నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి||

చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2) ||నీ మనసు||

ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు||

ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||

English Lyrics

Audio

HOME