కలలాంటి బ్రతుకు నాది

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది (2)
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం (2)      ||కలలాంటి||

నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే (2)       ||కలలాంటి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2)
ఆరాధన నీకే ఆరాధన (2)      ||ప్రకాశించే||

వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2)     ||ఆరాధన||

నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును (2)     ||ఆరాధన||

English Lyrics

Audio

HOME