కలవంటిది నీ జీవితము

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics


కలవంటిది నీ జీవితము
కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము (2)
విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము        ||కలవంటిది||

నిన్ను ఆకర్షించే ఈ లోకము
కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము (2)
ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము (2)        ||కలవంటిది||

నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును (2)
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు (2)        ||కలవంటిది||

English Lyrics

Audio

HOME