జన్మించె జన్మించె

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


జన్మించె జన్మించె – రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే
ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2)          ||ఊరూ వాడా||

తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు (2)
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి (2)          ||ఊరూ వాడా||

యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము (2)
మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2)          ||ఊరూ వాడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బేత్లేహేం పురమున

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే

ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి            ||బేత్లేహేం||

పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు         ||బేత్లేహేం||

నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ       ||బేత్లేహేం||

దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో       ||బేత్లేహేం||

గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో     ||బేత్లేహేం||

English Lyrics

Audio

HOME