చాచిన చేతులు నీవే

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics

చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు       ||చాచిన||

కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని (2)
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా (2)
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు        ||చాచిన||

పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని (2)
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు         ||చాచిన||

English Lyrics

Audio

విరిసిన హృదయాలకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విరిసిన హృదయాలకు కలిసెను బంధం
కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2)
తీయని భాసలే కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే         ||విరిసిన||

ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2)
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2)
మరువకుమా ప్రియ మరువకుమా         ||విరిసిన||

మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2)
ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2)
మరువకుమా ప్రియ మరువకుమా           ||విరిసిన||

English Lyrics

Audio

మహిమగల తండ్రి

పాట రచయిత: డేవిడ్ రాజు
Lyricist: David Raju

Telugu Lyrics


మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2)       ||మహిమ||

నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)
అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2)         ||కాయవే||

అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2)         ||కాయవే||

కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2)
నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2)
యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2)         ||కాయవే||

ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2)
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2)         ||కాయవే||

English Lyrics

Audio

కమ్మని బహుకమ్మని

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2)
జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2)
యేసు నీ ప్రేమామృతం (2)        ||కమ్మని||

ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)
కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)        ||కమ్మని||

నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2)
ఆరాధింతును నిన్ను అనుదినము (2)
జీవింతును నీకై అనుక్షణము (2)        ||కమ్మని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME