పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
కనరాని దేవుడు కనిపించెనా
తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా
జో.. లాలిజో.. జో… లాలిజో…
పరలోక భోగాలు వర దూత గానాలు
తనకున్న భాగ్యాలు విడనాడెనా (2)
పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో||
దావీదు తనయుండై మహిమా స్వరూపుండై
మానుజావతారుండై పవళించెనా (2)
గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా
ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో||
శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు
కడు శక్తిమంతుడు కమనీయుడు (2)
ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే
అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||