దావీదు తనయా హోసన్నా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


హోసన్నా…
హోసన్నా హోసన్నా హోసన్నా (3)
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా (2)
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా      ||దావీదు||

గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా (2)
నీకై వేచెను బ్రతుకంతా      ||దావీదు||

కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు (2)
జనావాహినికే సుబోధకాలు      ||దావీదు||

పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా (2)
పరిచితిమివిగో మా హృదయాలు      ||దావీదు||

English Lyrics

Audio

ఇదేనా న్యాయమిదియేనా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఇదేనా న్యాయమిదియేనా
కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ       ||ఇదేనా||

కుంటి వారికి కాళ్ళ నొసగే
గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే
రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర       ||ఇదేనా||

చెడుగు యూదులు చెరను బట్టి
కొరడా దెబ్బలు కసిగా గొట్టి
వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్       ||ఇదేనా||

మోయలేని సిలువ మోపి
గాయములను ఎన్నో చేసి
నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో       ||ఇదేనా||

ప్రాణముండగానే సిలువ కొయ్యకు
మేకులెన్నో కొట్టిరయ్యో
ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో       ||ఇదేనా||

ఎన్ని బాధలు పెట్టిన గాని
మారు పల్కడు యేసు ప్రభువు
ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి       ||ఇదేనా||

ఎన్ని మారులు పాపము చేసి
యేసుని గాయముల్ రేపెదవేల
నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల       ||ఇదేనా||

English Lyrics

Audio

HOME