ఎల్లవేళలందు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్‌ (2)

విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్లవేళలందు||

సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2)        ||ఎల్లవేళలందు||

నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)        ||ఎల్లవేళలందు||

జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2)        ||ఎల్లవేళలందు||

కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2)        ||ఎల్లవేళలందు||

English Lyrics

Audio

Chords

కష్ట నష్టాలైనా

పాట రచయిత: ఎన్ అషెర్ బుషన్న
Lyricist: N Asher Bushanna

Telugu Lyrics

కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)
ఓ యేసయ్యా…
ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే(2)

నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కొండగా అండగా – నీవుండగ లోకాన
ఎండిన ఎముకలయినా – ఉండుగా జీవంగా
యేసయ్య మార్గమే నడవర ఓరన్న (2)         ||కష్ట||

కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను
నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను (2)          ||కష్ట||

English Lyrics

Audio

సన్నుతింతు యేసు స్వామి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను           ||సన్నుతింతు||

సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును            ||సన్నుతింతును||

మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2)
అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును
యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము           ||సన్నుతింతును||

English Lyrics

Audio

HOME