నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu

Telugu Lyrics


యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా||

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2)      ||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2)      ||యేసయ్యా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

కొండలలో కోనలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2)         ||కొండలలో||

కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము
శ్రావ్యా రాగము (2)
పరమ గీతము         ||కొండలలో||

దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే
రండి శీఘ్రమే (2)
తరలి వేగమే          ||కొండలలో||

English Lyrics

Audio

HOME