కావలివాడా ఓ కావలివాడా

పాట రచయిత:సిద్దిపేట ప్రకాష్
Lyricist: Siddipet Prakash

Telugu Lyrics

కావలివాడా ఓ కావలివాడా
కనులు తెరచి పొలమును చూడు
కోతకు వచ్చిన పంటను కోయుము        ||కావలి||

పిలిచెను నీ యజమానుడు
జత పనివాడవై యుండుటకు (2)
కొలుచును నీ ఫలమంతమున
పని చేసిన రీతిగనే (2)     ||కావలి||

నమ్మెను నీ యజమానుడు
అప్పగించెను తన స్వాస్థ్యము (2)
తిరిగి వచ్చును జీతమియ్యను
సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2)     ||కావలి||

ఎంచెను నీ యజమానుడు
నీ పాదములు సుందరములని (2)
ఉంచెను కర్మెలు పర్వతముపై
పరుగిడుము పరాక్రమ శాలివై (2)     ||కావలి||

వేయుము పునాది నేర్పరివై
చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2)
కొయ్య కాలును కర్ర గడ్డియు
కాలిపోవును అగ్ని పరీక్షలో (2)     ||కావలి||

English Lyrics

Audio

ఇది కోతకు సమయం

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)         ||ఇది కోతకు||

కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2)         ||ఇది కోతకు||

సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2)         ||ఇది కోతకు||

శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపవా (2)         ||ఇది కోతకు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME