అపరాధిని యేసయ్యా

పాట రచయిత: సిరిపురపు కృపానందము
Lyricist: Siripurapu Krupaanandamu

Telugu Lyrics

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆనందముగా యెహోవా నీ

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున           ||ఆనందముగా||

సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్         ||ఆనందముగా||

ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్       ||ఆనందముగా||

పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా –
స్మరియించెద నీ విశ్వాస్యతన్             ||ఆనందముగా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME