మానను మానను

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

యేసు నిన్ను నే స్తుతియించుట
మానను మానను మానను
కృతజ్ఞతలు నీకు చెల్లించుట
ఎన్నడూ మాననే మానను

ప్రతికూల పరిస్థితులు
వెంటాడు ఘడియలలో
నీ సిలువ తట్టు తిరిగి
నీ యాగమును తలచి        ||యేసు నిన్ను||

సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి
వరముగా నిత్యజీవము నిచ్చితివి
నాకింక నిన్ను స్తుతియించకుండా
ఉండు కారణమేది లేకపోయెను        ||యేసు నిన్ను||

పరమందు ధనవంతుడు నేనగుటకు
దారిద్యములో నీవు జీవించితివి
ఈ లోక ధనము నను విడచిపోయి
దరిద్రునిగా నే మిగిలినను        ||యేసు నిన్ను||

నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి
నా పాప రోగము కడిగితివి
ఈనాడు నీవు నా దేహరోగము
స్వస్థపరచినా లేకున్నా        ||యేసు నిన్ను||

అసాధ్యుడవు నీవు సర్వాధికారివి
సార్వభౌముడవు దయాలుడవు
నా జీవితములో నా మేలుకోరకే
సమస్తమును జరిగించు వాడవు        ||యేసు నిన్ను||

Download Lyrics as: PPT

యేసువలె

పాట రచయిత: బ్లెస్సన్ మేమన
అనువదించినది: గ్లోరి రాణి
Lyricist: Blesson Memana
Translator: Glory Rani

Telugu Lyrics


యేసువలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2)
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు
నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2)

నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2)
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే
నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు – (2)

విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం
కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం (2)
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె
నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కృతజ్ఞతతో స్తుతి పాడెద

పాట రచయిత: పి జి అబ్రహాం
అనువదించినది: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: P G Abraham
Translator: Joel N Bob

Telugu Lyrics


కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)

అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2)         ||కృతజ్ఞతతో||

నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు       ||కృతజ్ఞతతో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఏ రీతి స్తుతియింతును

పాట రచయిత: తాతపూడి జ్యోతి బాబు
Lyricist: Thathapudi Jyothi Babu

Telugu Lyrics


ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా            ||ఏ రీతి||

ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా        ||ఏ రీతి||

ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని
నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా
నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా
నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా           ||ఏ రీతి||

నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను
నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను
నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా
యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా          ||ఏ రీతి||

English Lyrics

Audio

HOME