ఒక క్షణమైనా నిన్ను

పాట రచయిత: జోసఫ్ కొండా
Lyricist: Joseph Konda

Telugu Lyrics

ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)            ||ఒక క్షణమైనా||

నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)
నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా             ||యేసయ్యా||

మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)
నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా              ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవు లేని క్షణమైనా

పాట రచయిత: ఆర్ లాజరస్
Lyricist: R Lazarus

Telugu Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…          ||నీవు లేని||

శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆశ్రయమా ఆధారమా

పాట రచయిత: కే వై రత్నం
Lyricist: K Y Ratnam

Telugu Lyrics

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2)       ||ఆశ్రయమా||

కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2)       ||ఆశ్రయమా||

భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు (2)       ||ఆశ్రయమా||

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు (2)       ||ఆశ్రయమా||

English Lyrics

Audio

నీవు లేక క్షణమైనా

పాట రచయిత: రవిందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics


నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)

నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా (2)
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)
విలువైనదేది నీకన్నా          ||యేసయ్యా||

నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా (2)
నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)
పరిశుద్ధాత్మను ప్రోక్షించు          ||యేసయ్యా||

English Lyrics

Audio

పువ్వులాంటిది జీవితం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా
ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)

పాల రాతపైన నడిచినా గాని
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం
నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2)          ||పువ్వు||

జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే
అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)         ||పువ్వు||

ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే
ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2)        ||పువ్వు||

English Lyrics

Audio

Chords

HOME