నా దేవుని కృపవలన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును (2)
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు (2)       ||నా దేవుని||

కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును (2)
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును (2)       ||నా దేవుని||

శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము (2)
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము (2)       ||నా దేవుని||

ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును (2)
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును (2)       ||నా దేవుని||

English Lyrics

Audio

మార్గములను సృజించువాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)

ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2)        ||నేను||

జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2)        ||నేను||

English Lyrics

Audio

 

 

 

HOME