ఎల్లలు లేనిది

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా (2)         ||ఎల్లలు||

జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా (2)
విడువనిది మరువనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా          ||ఎల్లలు||

కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
తరగనిది చెదరనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా         ||ఎల్లలు||

English Lyrics

Audio

యెహోవా మా కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

English Lyrics

Audio

 

 

 

HOME