నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా

పాట రచయిత: పాలపర్తి ప్రభుదాస్
Lyricist: Palaparthi Prabhudas

Telugu Lyrics


నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము         ||నా ప్రాణ||

ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని (2)
తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2)
నీ తోడు దొరికాక చిగురించితిని (2)        ||నీవు గాక||

శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
కష్టమంతయు తీరిపోయెను
బాధలన్నియు తొలగిపోయెను        ||నీవు గాక||

క్షణమైన నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2)
తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2)
నా కొరకు నీవు నీ కొరకు నేను (2)        ||నీవు గాక||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీవే నా ప్రాణం సర్వం

పాట రచయిత: డేవిడ్ విజయరాజు గొట్టిముక్కల, జోనా శామ్యూల్
Lyricist: David Vijayaraju Gottimukkala, Jonah Samuel

Telugu Lyrics


నీవే నా ప్రాణం సర్వం
నీవే నా ధ్యానం గానం
యేసయ్యా నీవే ఆధారం (2)
నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2)          ||నీవే||

నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది
నీ రాకకే కదా నేనెదురు చూచునది (2)
నీవలె ఉందును నీలో వసించెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా          ||నీవేగా||

నా కాపరి నీవే నా ఊపిరి నీవే
నా దారివి నీవే నా మాదిరి నీవే (2)
నీవలె ఉందును నీ వెంట సాగెదను (2)
అండా దండా కొండా నీవయ్యా
నాకున్న లోకం అంతా నీవయ్యా
అండా దండా కొండా నీవయ్యా
నీకన్నా వేరే ఎవరూ లేరయ్యా         ||నీవేగా||

English Lyrics

Audio

HOME