అద్భుతకరుడా

పాట రచయిత: ఓసీనాచి ఒకోరో
అనువదించినది:
అలెన్ గంట, జాన్ ఎర్రి, అను శామ్యూల్, జాన్ డేవిడ్ ఇంజ
Lyricist: Osinachi Okoro
Translator(s): Allen Ganta, John Erry, Anu Samuel, John David Inja

Telugu Lyrics

మా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకేనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకేనయ్యా

మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే.. నీవే యేసయ్యా (2)

మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్యా యేసయ్యా..
మా మనసులను స్వస్థపరచుము
యేసయ్యా యేసయ్యా.. నీవే        ||మార్గము||

చీకటి లోయలో సంచరించినా
నిరీక్షణ కోల్పోయినా
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చెదవు (2)        ||మార్గము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

షారోను పొలములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


షారోను పొలములో పూసిన పుష్పమా
అగాధ లోయలో దాగిన పద్మమా (2)
ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2)     ||షారోను||

ఆనందభరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము (2)
యేసు నాథుడు నిన్ను పిలువగా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2)     ||షారోను||

కొండలు దాటి బండలు దాటి
యేసు నాథుడు నిను చేరగా (2)
నీదు హృదయమున నివసింపనీయుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2)     ||షారోను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిరు దివ్వెల వెలుగులతో

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics


చిరు దివ్వెల వెలుగులతో
నీ దివ్య కాంతులతో
నను బ్రోవ రావయ్యా
కంటి పాపలా.. నను కాన రావయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నను బ్రోవ రావయ్యా
నను కాన రావయ్యా (2)
ఆ లోయలో… క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2)

దహించివేస్తున్న అవమానము
కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము
కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము
కానరాని గమ్యము (2)         ||చిరు||

ఏకమైన ఈ లోకము
వేధిస్తున్న విరోధము
దూరమవుతున్న బంధము
తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము
చేరువైన అగాధము (4)           ||చిరు||

English Lyrics

Audio

చీకటి లోయలో

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
నీవే.. దేవా నేవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు

అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను
నీవే నా మార్గమని నిను వెంబడించెదను
నా చేయి పట్టి నను నడిపించుము
నీకే.. దేవా నీకే.. నీకే నీకే
నా సమస్తము నీకే అర్పింతును
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని
శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని
మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

English Lyrics

Audio

గాడాంధకారపు లోయలో

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే         ||గాడాంధకారపు||

పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే             ||గాఢాంధకారపు||

నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే          ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే              ||గాఢాంధకారపు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME