మధురమైనది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2)        ||మధురమైనది||

ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)
మరణపు ఛాయలే దరి చేరనీయక (2)
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం        ||ప్రేమా||

నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

English Lyrics

Audio

 

నీ ప్రేమ ఎంతో

పాట రచయిత: అబ్రహాం
Lyricist: Abraham

Telugu Lyrics

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు
యేసయ్యా నీ ప్రేమ మధురం
యేసయ్యా మధురాతి మధురం (2)     ||నీ ప్రేమ||

మరచిపోనిది నీ ప్రేమా
నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా
జీవ కాలముండును నీ ప్రేమా (2)      ||నీ ప్రేమ||

సిలువకెక్కెను నీ ప్రేమా
నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా
నాకై మరణించెను నీ ప్రేమా
నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2)     ||నీ ప్రేమ||

తల్లికుండునా నీ ప్రేమా
సొంత చెల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమా
కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)       ||నీ ప్రేమ||

త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)         ||నీ ప్రేమ||

English Lyrics

Audio

HOME