ప్రభుని స్మరించు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)

నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3)        || ప్రభుని ||

ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3)        || ప్రభుని ||

పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3)        || ప్రభుని ||

మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3)        || ప్రభుని ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసుని నామములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే    ||యేసుని||

ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు            ||యేసు రక్తముకే ||

రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు         ||యేసు రక్తముకే ||

English Lyrics

Audio

HOME