సూడ సక్కని బాలుడమ్మో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సూడ సక్కని బాలుడమ్మో
బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
కన్య మరియ గర్భమున
ఆ పరిశుద్ధ స్థలమున (2)
మనకై జన్మించినాడు
మనలను రక్షించినాడు (2)        ||సూడ||

బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
పరవశించ సాగెను (2)        ||సూడ||

మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
దివి నుండి భువిపైకి దిగి వచ్చి
మానవులను ప్రేమించెను (2)        ||సూడ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

జాగోరే జాగోరే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జాగోరే జాగోరే జాగు జాము రాతిరి
యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2)
కన్నియ మరియ కన్నులు విరియ
పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన          ||జాగోరే||

దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది
తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2)
వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2)
ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా          ||జాగోరే||

వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా
బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా (2)
పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా (2)
ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా            ||జాగోరే||

English Lyrics

Audio

HOME