ఉదయకాలము మధ్యాహ్నము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (2)

లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (4)

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

నా యేసయ్య ప్రేమ

పాట రచయిత: జ్యోతి మనోహర్
Lyricist: Jyothi Manohar

Telugu Lyrics


నా యేసయ్య ప్రేమ
నా తండ్రి గొప్ప ప్రేమ (2)
వర్ణించగలనా నా మాటతో
నే పాడగలనా క్రొత్త పాటతో (2)             ||నా యేసయ్య||

నా పాపనిమిత్తమై
సిలువనూ తానే మోసే
ఈ ఘోర పాపి కొరకై
తన ప్రాణము అర్పించెనే (2)
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే (2)          ||నా యేసయ్య||

తప్పి పోయిన నన్ను
వెదకి రక్షించితివే
ఏ దారి లేక ఉన్నా
నీ దరికి చేర్చితివే (2)
ఏముంది నాలో దేవా
ఏ మంచి లేనే లేదే (2)           ||నా యేసయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు రాజ నాలో నిన్ను

పాట రచయిత: రాజబాబు
Lyricist: Rajababu

Telugu Lyrics


యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా – (2)          ||యేసు రాజ||

తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

English Lyrics

Audio

అగ్ని మండించు

పాట రచయిత: ఫ్రెడ్డీ పాల్
Lyricist: Freddy Paul

Telugu Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)       ||అగ్ని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నాలో ఉండి నను నడిపించేటి

పాట రచయిత: రవీందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics

నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2)

ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా (2)

English Lyrics

Audio

HOME