నీ రూపం నాలోన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2)      ||నీ రూపం||

నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2)      ||నీ రూపం||

నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
హృదయాసీనుడా నా యేసయ్యా (2)      ||నీ రూపం||

అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే (2)
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
భుజమును తట్టి నడిపెదవే (2)      ||నీ రూపం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఏముంది నాలోనా

పాట రచయిత: ప్రతాప్ చిలమకూరు
Lyricist: Prathap Chilamakuru

Telugu Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2)         ||ఏ యోగ్యత||

మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములే చేసినానే (2)        ||ఏముంది||

పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2)        ||ఏముంది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ఊహకందని ప్రేమతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు (2)          ||నా ఊహకందని||

అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని (2)          ||నా ఊహకందని||

జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా (2)
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని (2)          ||నా ఊహకందని||

నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు (2)
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని (2)          ||నా ఊహకందని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME