అన్ని నామముల కన్న ఘనమైన

పాట రచయిత: బి ఎస్తేరు రాణి
Lyricist: B Esther Rani

Telugu Lyrics

అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||

దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు (2)
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||

గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||

English Lyrics

Audio

అన్ని నామముల కన్న

పాట రచయిత: ఎం జ్యోతి రాజు
Lyricist: M Jyothi Raju

Telugu Lyrics

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2)       ||యేసు నామము ||

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)        ||యేసు నామము ||

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)            ||యేసు నామము ||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME