నా కృప నీకు చాలని

పాట రచయిత: కే సాల్మన్ రాజు
Lyricist: K Solmon Raju

Telugu Lyrics


నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ (2)       ||నా కృప||

నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2)      ||నాతో||

పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2)      ||నాతో||

English Lyrics

Audio

నన్ను కావగ వచ్చిన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా
నేను పాపము చేసినా చూపావు నీ దయా
నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా
సిలువ నీడలో నన్ను దాచుమయ్యా
లోకమంతా నన్ను దోషిగ చూసినా
ప్రేమతోనే నన్ను చేరదీసిన           ||నన్ను||

నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాథ చేసి పోయినా
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా          ||నన్ను||

నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా
నీ వారసునిగా నన్ను ఎంచిన
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా            ||నన్ను||

English Lyrics

Audio

HOME