నల్లా నల్లాని చీకటి

పాట రచయిత: కిరణ్ జిమ్మి
Lyricist: Kiran Jimmy

ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది

ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై

నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)
నల్లా నల్లని నీ హృదయము
యేసుకిస్తే తెల్లగ మారును (2)

తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి (2)

సీకట్ల సుక్క బుట్టెరో
ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో (2)
నీ మనస్సులో యేసు బుడితే
నీ బతుకే ఎలిగి పొవును (2)       ||తూర్పున చుక్క||

చల్లా చల్లాని చలిరో
ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో
చల్లగుంటే సల్లారి పొతవ్
ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్ (2)       ||తూర్పున చుక్క||

హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)

నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల (2)

హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే (2)

Download Lyrics as: PPT

HOME