చూచుచున్న దేవుడవు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము (2)

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||

English Lyrics

Audio

HOME