యావే

పాట రచయిత: సామ్ పడింజరెకర
అనువదించినది:
ఫాన్ని జాయ్ మోసెస్
Lyricist: Sam Padinjarekara
Translator: Fannie Joy Moses

Telugu Lyrics

భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)

యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2)

మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2)      ||యావే||

ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి (2)
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా (2)      ||యావే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME