నీ సన్నిధిలో ఈ ఆరాధనను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా (2)
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా        ||నీ సన్నిధిలో||

ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు (2)
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2)
వర్షముగా నను మార్చావు – మార్చావు          ||నీ సన్నిధిలో||

మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి (2)
నీ రక్తముతో నను ప్రోక్షించి (2)
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు       ||నీ సన్నిధిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆత్మ వర్షము మాపై

పాట రచయిత: పాల్ ఇమ్మానుయేల్
Lyricist: Paul Emmanuel

Telugu Lyrics

ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము (2)       ||ఆత్మ||

యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి (4)
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి (2)
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము (2)       ||ఆత్మ||

పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను (2)
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి (2)
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము (2)       ||ఆత్మ||

English Lyrics

Audio

రోజంతా ద్వేషం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రోజంతా ద్వేషం మనుషుల కోపం
తీరని బాధ ఇది తీరము చేరనిది
అవమానం ఆవేశం
కన్నీళ్ళే ఈ దేహం
విరిగిన హృదయం నలిగిన దేహం
శవమై పోవులే ఈ జీవితము
ఊపిరి ఆహుతై మిగిలెనే

నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2)

గర్బము లేని ఈ శరీరము
నిందై పోయిన ఈ జీవితము
నీ ప్రజలే నన్ను ద్వేషించగా
అయిన వాల్లే శోధించిగా
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో (2)

నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2)
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో (2)

నిలబెట్టుము దేవా నీ ప్రజలతో
నిందైన నన్ను నీ సాక్షముతో
చేయి పట్టి నడుపుము నీ మార్గములో
పడుతున్న నన్ను నీ వాక్యముతో

ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది
ఎవరు ప్రేమించినా నీ ప్రేమా అది
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో (2)

నీ కృప నాకు చాలును దేవా
నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2)
రావా దేవా నీ ప్రేమతో
నింపుము ప్రభువా నీ కృపతో (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME