యేసు ప్రభువా నీవే

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


యేసు ప్రభువా నీవే
మహిమా నిరీక్షణా (2)
హల్లెలూయా హల్లెలూయా
మహిమా నిరీక్షణా నీవే (2)        ||యేసు||

గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)
మహిమా నిరీక్షణా నీవే
నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసు ప్రభో జయహో (4)      ||యేసు||

నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)
ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును (2)
యేసు ప్రభో జయహో (4)      ||యేసు||

ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)
పరలోకమే నా దేశము
మహిమలోనచ్చట నుందును (2)
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో (2)      ||యేసు||

English Lyrics

Audio

Chords

నా ప్రాణమా ఏలనే

పాట రచయిత: ఆర్ మధు
Lyricist: R Madhu

Telugu Lyrics


నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)
నెమరేసుకుంటూ ప్రాణమా
స్తుతిపాడుమా – స్తుతిపాడుమా        ||నా ప్రాణమా||

నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)
నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
నీవు కూడా తన కార్యం పాటించుమా (2)
అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా
మరువకు సుమా – మరువకు సుమా        ||నా ప్రాణమా||

నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు
నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2)
నా ప్రాణమా నాలో కరిగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని దయ కోరుమా
దయ కోరుమా – దయ కోరుమా        ||నా ప్రాణమా||

నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు
నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2)
నా ప్రాణమా నాలో కృంగిపోకే
నీ గతం ఏమిటో మరచిపోకే (2)
దినమెల్ల దేవుని కృప కోరుమా
కృప కోరుమా – కృప కోరుమా         ||నా ప్రాణమా||

English Lyrics

Audio

లోకాన ఎదురు చూపులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)         ||లోకాన||

English Lyrics

Audio

HOME