యుద్ధ వీరులం

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం – పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం        ||యుద్ధ||

గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
విశ్వాసమే ఆయుధం – ప్రార్ధనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని – తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం       ||జయము||

జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించి
జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించెదం

ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
బ్రతుకుట ప్రభు కోసమే – చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను – మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం       ||జయము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

హోసన్నా హల్లెలూయా

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా (2)
స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్
నోరారా పాడెదము (2)
రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు
స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2)           ||హోసన్నా||

కెరూబులు సెరూపులు
ఇరువది నలుగురు పెద్దలతో (2)
నాలుగు జీవుల గానాలతో (2)
స్తుతియింపబడుచున్న యేసునకు (2)           ||హోసన్నా||

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు
సర్వ సృష్టికి మూలకారకుడు (2)
మృతుడై మరలా బ్రతికినవాడు (2)
మేఘముపై రానున్న యేసునకు (2)           ||హోసన్నా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME