స్వఛ్చంద సీయోను వాసి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


స్వఛ్చంద సీయోను వాసి
సర్వాధికారి – కస్తూరి పూరాసి (2)
వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)
అల్ఫా ఒమేగ తానే (2)
ఆద్యంతము మన యేసే (2)       ||స్వఛ్చంద||

ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)
లెక్క లేని యద్భుతముల్ (2)
మక్కువతో చేయువాడు (2)       ||స్వఛ్చంద||

సంగీతం నాదముల తోడ
సీయోను పురము – సొంపుగను చేరితిమి (2)
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)
దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)
మిక్కిలి ఆనందము కల్గెన్ (2)       ||స్వఛ్చంద||

నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో – మాణిక్య మణులతో (2)
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2)
ప్రశస్త రత్నములతో (2)
ప్రవిమలముగా నిను గట్టెదను (2)       ||స్వఛ్చంద||

సుమముల హారము
సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2)
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2)
హిత వత్సరము విముక్తి (2)
ఆత్మాభిషేకము నీదే (2)       ||స్వఛ్చంద||

జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2)
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2)
అగ్ని మధ్యను నడచినను (2)
జ్వాలలు నిను కాల్చగ లేవు (2)       ||స్వఛ్చంద||

ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2)
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2)
రహస్యములో మరుగైన (2)
ధనమును నీ కొసంగెదను (2)       ||స్వఛ్చంద||

గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2)
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2)
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2)
ఎత్తుకొను వాడను నేనే (2)       ||స్వఛ్చంద||

English Lyrics

Audio

Chords

అల్ఫా ఒమేగయైన

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా||

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే (2)       ||అల్ఫా||

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే (2)       ||అల్ఫా||

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే (2)       ||అల్ఫా||

English Lyrics

Audio

HOME